Sonu Sood : హైదరాబాద్ : ఆల్ఫాలీట్ వాడడం వల్ల మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తుందన్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. భారతదేశంలో అత్యంత పారదర్శకమైన, ల్యాబ్-పరీక్షించిన, అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన హెల్త్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో ‘ఆల్ఫాలీట్’ బ్రాండ్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ వేడుకలో ‘ఇండియన్ రియల్ హీరో’ సోనూ సూద్ ముఖ్య అతిథిగా పాల్గొని, ‘ఆల్ఫాలీట్’ బ్రాండ్‌ను ఆవిష్కరించారు.
Sonu Sood Announce Alphalite
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనూసూద్ తో పాటు మిస్ ఇండియా మానస ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “Authentic – Exclusive – Performance” అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన ఆల్ఫాలీట్, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అత్యుత్తమ సప్లిమెంట్లను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సోనూసూద్ (Sonu Sood) మాట్లాడుతూ ఆల్ఫాలీట్ వంటి ఒక అద్భుతమైన బ్రాండ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్లు సురేష్ శుక్లా, శ్రవణ్ ఘంటలకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ తెలిపారు.
ఈ రోజుల్లో యువత ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపుతోంది. అయితే, మార్కెట్లో కల్తీ సప్లిమెంట్ల బెడద కూడా అదే స్థాయిలో పెరిగిందన్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. సరైన సప్లిమెంట్స్ తీసుకోకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా, తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉందన్నారు.
ఇలాంటి సమయంలో, పూర్తి పారదర్శకతతో, ల్యాబ్-టెస్టులు చేసి, అమెరికా ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే ఆల్ఫాలీట్ సంకల్పం ప్రశంసనీయం. ఫిట్‌నెస్‌లో సప్లిమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి, కానీ సరైనవి ఎంచుకోవడం అంతకంటే ముఖ్యం. ఆల్ఫాలీట్ నాణ్యత విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, వినియోగదారుల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుందని అన్నారు.
ఫిట్‌నెస్ ఔత్సాహికులు, యువత సరైన సమాచారంతో, నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవాలి. ఆల్ఫాలీట్ ఆ నమ్మకాన్ని నిలబెడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ బ్రాండ్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని, నాణ్యతలో అమెరికా ప్రమాణాలను పాటిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : జనం నెత్తిన రూ. 17 వేల కోట్ల విద్యుత్ భారం
