న్యూఢిల్లీ : యధేశ్చగా ఎలాంటి కట్స్ లేకుండా పెద్ద ఎత్తున హింస, రొమాన్స్ పేరుతో సెక్స్ నను విచ్చలవిడిగా వెబ్ సీరీస్ పేరుతో ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. దీంతో చిన్నారుల నుంచి పెద్ద వారి దాకా వీటి బారిన పడుతున్నారు. నెట్ కనెక్టివిటీ ఉండడంతో కోట్లాది మంది వీటిని వాడుతున్నారు జోరుగా. దీంతో వీక్షకుల బలహీనతలు ఆసరాగా చేసుకుని ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు ఎలాంటి రూల్స్ పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తాజాగా కేంద్ర సర్కార్ ఉక్కు పాదం మోపేందుకు రెడీ అయ్యింది. ఇందు కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ఓటీటీ ప్లాట్ ఫారమ్ ల కోసం ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ )కోసం నిబంధనలలో సమూల మార్పులు చేయాలని భావించింది. ఈ మేరకు పీఎం ఆధ్వర్యంలో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా జూలై 3న విడుదలైన ‘సట్లూజ్’ సినిమా జాతీయ భద్రతా కారణాలను పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు రెండు రోజుల తర్వాత జీ5 నుండి తొలగించబడింది. ఇక నుంచి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలను విడుదల చేయడానికి ముందు వాటికి ధృవీకరణ తప్పనిసరి చేసేలా ఐటీ నిబంధనలు 2021’ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా విడుదలైన ‘సట్లూజ్’ సినిమాపై వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ నుండి తప్పనిసరి ధృవీకరణ, అనుమతిని పొందే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
