BRS : హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS) సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ప్రధానంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రిగ్గింగ్ కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సీఎం హోం శాఖ మంత్రిగా కూడా ఉన్నారని, ఆయన గత చరిత్ర అంతా నేరమయం కావడం, దానికి తోడు నేర చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా బరిలోకి దించారని దీని వల్ల ఎక్కువగా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టాలని ఇప్పటికే తాము ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
BRS Party Shocking Allegations on Jubilee Hills
అంతే కాకుండా కాంగ్రెస్, మజ్లిస్ కలిసి అల్లర్లు సృష్టించి రిగ్గింగ్ పాల్పడే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర బలగాలు దించాలని ఈసీని కోరారు. ఇక హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇక్కడి పోలీసులు ఎన్నికల పారదర్శకంగా చేస్తారని నమ్మకం లేదన్నారు. తెలంగాణ సీఎం, మంత్రులు కోడ్ ఉల్లంఘించారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొంది . ఢిల్లీలోని సీఈసీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కూడా ఫిర్యాదు చేశారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read : CM Revanth Reddy Shocking Comments on KCR : పీజేఆర్ కుటుంబాన్ని అవమానించిన కేసీఆర్
