OpenAI New Innovation : ఇండియాలో ఓపెన్ ఏఐ కార్యాల‌యం

ఏర్పాటు చేయ‌నున్న సీఈఓ ఆల్ట్ మాన్

Hello Telugu - OpenAI New Innovation

Hello Telugu - OpenAI New Innovation

OpenAI : అమెరికా – ప్ర‌పంచాన్ని డామినేట్ చేస్తోంది ఓపెన్ ఏఐ (OpenAI). దీని దెబ్బ‌కు దిగ్గ‌జ ఐటీ కంపెనీలు విల విల లాడుతున్నాయి. భారీ ఎత్తున దీనిని కైవ‌సం చేసుకునేందుకు భారీ ఆఫ‌ర్లు కూడా ప్ర‌క‌టించాయి. కానీ ఎక్క‌డా త‌ల వంచ‌డం లేదు. ఇదిలా ఉండ‌గా ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓ ఆల్ట్ మాన్ కీల‌క విష‌యం వెల్ల‌డించాడు. ఈ ఏడాదిల‌లోనే తాను భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. దీంతో అంద‌రి క‌ళ్లు త‌న‌పై పడ్డాయి. దీనికి కార‌ణం లేక పోలేదు. ప్ర‌పంచ ఐటీ రంగంలో అత్య‌ధికంగా ఉన్న‌త స్థానాల‌లో ప‌ని చేస్తున్న వారంతా మ‌న వాళ్లే ఉన్నారు. తాజాగా ఓపెన్ ఏఐ నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. 2025లోనే భార‌త దేశంలో త‌న మొద‌టి కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు ఓపెన్ ఏఐ సిఇఓ.

OpenAI New Branch in India

ఇదిలా ఉండ‌గా కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ స‌ర్కార్ ఇండియా ఏఐ మిష‌న్ ను ఏర్పాటు చేసింది. కృత్రిమ మేధ‌స్సును నిర్మించేందుకు ప్ర‌భుత్వంతో భాగ‌స్వామ్యం కావ‌డానికి ఇది ఉప‌యోగ ప‌డుతుంద‌ని, అందుకే ఆఫీస్ ను ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున్నట్లు తెలిపాడు ఆల్ట్ మాన్. అయితే ఈ ఆఫీసును ఈ ఏడాది చివ‌ర‌లో దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌చింది ఓపెన్ ఏఐ. సెప్టెంబ‌ర్ నెల‌లో ఇండియాకు త‌మ సంస్థ అధినేత వ‌స్తార‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ కంపెనీ ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబ‌డి పెట్టేందుకు తాను ఉత్సాహంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాడు ఆల్ట్ మాన్.

Also Read : Tejashwi Yadav Shocking Comments : మోదీపై కామెంట్స్ తేజ‌స్వి యాద‌వ్ పై కేసు

Exit mobile version