Tejashwi Yadav Shocking Comments : మోదీపై కామెంట్స్ తేజ‌స్వి యాద‌వ్ పై కేసు

బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ న‌రోటే ఫిర్యాదు

Hello Telugu - Tejashwi Yadav Shocking Comments

Hello Telugu - Tejashwi Yadav Shocking Comments

Tejashwi Yadav మ‌హారాష్ట్ర – ఆర్జేడీ అగ్ర నాయ‌కుడు , మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యే మిలింద్ స‌రోటే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ అధినాయ‌కుడు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీపై నోరు జారారంటూ మండిప‌డ్డారు తేజ‌స్వి యాద‌వ్ (Tejashwi Yadav) ను. ఆయ‌న గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌ధానిపై అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్ట్ చేసినందుకు తేజ‌స్వి యాద‌వ్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని పోలీసులు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై కేసు నమోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Tejashwi Yadav Slams PM Modi

గడ్చిరోలికి చెందిన బిజెపి ఎమ్మెల్యే మిలింద్ నరోటే ఆర్జేడీ నాయకుడిపై ఫిర్యాదు చేసినట్లు ధ్రువీక‌రించారు సీనియర్ పోలీసు అధికారి. బీహార్‌లోని గయ పర్యటనకు ముందు ప్రధానిపై యాదవ్ అభ్యంతరకరమైన వ్యాఖ్యను పోస్ట్ చేశారని నరోటే తన ఫిర్యాదులో ఆరోపించారని ఆయన అన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196 (వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 356 (పరువు నష్టం), 352 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశ పూర్వకంగా అవమానించడం) 353 (ప్రజా దుష్ప్రవర్తనకు కారణమయ్యే ప్రకటనలు) కింద ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌పై కేసు న‌మోదు చేయ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్.

Also Read : Novotel Interesting Update : ఫుడ్, బెవరేజ్ ఫుడ్ డైరెక్టర్‌గా జ్ఞాన్ దీప్ సింగ్

Exit mobile version