Hyderabad to Amaravati Approved : హైదరాబాద్ టు అమ‌రావ‌తి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే

గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మోదీ కేంద్ర ప్ర‌భుత్వం

Hello Telugu - Hyderabad to Amaravati Approved

Hello Telugu - Hyderabad to Amaravati Approved

Amaravati : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం కేంద్ర స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR)ను తయారు చేసే బాధ్యతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అప్పగించారు. రోడ్లు, రవాణా శాఖను వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 3న కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కేంద్ర రోడ్లు, రవాణా, ఉక్కు, బొగ్గు గనులు, వ్యవసాయం, పెట్రోలియం, రైల్వే శాఖల సీనియర్ అధికారులతో సహా 15 విభాగాల అధికారులతో విస్తృత సమావేశం నిర్వహించారు.

Hyderabad to Amaravati Expressway Approved

ఈ కీల‌క మీటింగ్ లో ప్ర‌ధానంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు సంబంధించి విభ‌జ‌న చ‌ట్టంలో పొందు ప‌ర్చిన అంశాల‌పై ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. పెండింగ్ లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఇరు రాష్ట్రాల ప్ర‌తినిధులు కోరారు. ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన‌ మినిట్స్‌ను ఇటీవల ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోం మంత్రిత్వ శాఖ పంపింది. హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తి (Amaravati) వ‌ర‌కు చేప‌ట్టే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేకు దాదాపు రూ. 25,000 కోట్ల ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు స‌మాచారం. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ వ్యయం, భూసేకరణతో సహా మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించేందుకు హామీ ఇచ్చిందని అధికారులు తెలిపారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా ఉంటుందని, అంటే ఇది ఇప్పటికే ఉన్న రోడ్లను దాటవేసి పూర్తిగా కొత్త నిర్మాణం చేప‌ట్టనున్నారు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను ఖరారు చేయడం , భూసేకరణ వంటి కీలకమైన చర్యలు ఇంకా పూర్తి కాలేదు. అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని, ఆర్థిక కార్యకలాపాలను మెరుగు పరుస్తుందని, దాని మార్గంలో కొత్త పట్టణాలు, వాణిజ్య కేంద్రాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

Also Read : Perni Nani Sensational Comments : మ‌నం అధికారంలోకి వ‌చ్చాక లేపేయండి

Exit mobile version