Perni Nani Sensational Comments : మ‌నం అధికారంలోకి వ‌చ్చాక లేపేయండి

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పేర్ని నాని

Hello Telugu - Perni Nani Sensational Comments

Hello Telugu - Perni Nani Sensational Comments

Perni Nani : అమ‌రావ‌తి – మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. చెప్పికాదు చెప్పకుండా నరికేయాలన్నారు. చీకట్లో కన్ను కొడితే పని అయి పోవాల‌న్నారు. అంతా అయి పోయాక పరామర్శలకు వెళ్లాలి.. ఇప్పుడు అరవడం కాదు తప్పు చేసిన వాడు ఎవరైనా ఉంటే మన ప్రభుత్వం వచ్చాక వేసేయండంటూ పిలుపునిచ్చారు. జగన్ సరదగా రప్పా రప్పా అన్నారని, మీరు దాన్ని పట్టుకుని రోజూ మాట్లాడితే జ‌నంలో చుల‌క‌నై పోతామ‌న్నారు. లోకేష్ చెప్పే రెడ్ బుక్ రేపు వారికే ఉరి తాడు కాక త‌ప్ప‌ద‌న్నారు. పామర్రులో జరిగిన కార్యకర్తల భేటీలో పేర్నినాని ఈ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. రాజ‌కీయ వ‌ర్గాల‌లో హాట్ టాపిక్ గా మారింది.

Perni Nani Comments Viral

అధికారం ఉంది క‌దా అని కూట‌మి నేత‌లు రెచ్చి పోతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు పేర్ని నాని (Perni Nani). కానీ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని పేర్కొన్నారు. కావాల‌ని త‌మ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేణుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగుతున్నార‌ని ఆరోపించారు. అంతే కాకుండా అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌ని, మ‌రికొంద‌రిని అకార‌ణంగా ఇరికించేందుకు ట్రై చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పేర్ని నాని. కేవ‌లం త‌మ‌పై ఒత్తిడి తీసుకు రావ‌డం త‌ప్పా ఏడాది పాల‌న‌లో కూట‌మి స‌ర్కార్ ఏం చేసిందంటూ ప్ర‌శ్నించారు .  మంత్రి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని నారా లోకేష్ రెచ్చి పోతున్నాడ‌ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేసే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు పేర్ని నాని.

Also Read : Engineering Colleges Shocking : 171 ఇంజ‌నీరింగ్ కాలేజీల‌లో 1,07,218 సీట్లు ఖాళీ

Exit mobile version