Cancer : భారత్‌లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదికలో పేర్కొంది. 2024లో దేశంలో 15.60 లక్షల కొత్త క్యాన్సర్ (Cancer) కేసులు నమోదవ్వగా, వీరిలో 8,74,404 మంది మరణించారు. ఈ స్థితి ఇలాగే కొనసాగితే 2045 నాటికి కేసుల సంఖ్య 24.60 లక్షలకు చేరే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జేఏఎంఏ)లో ప్రచురితమయ్యాయి.
Cancer – ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు
- పురుషుల్లో: నోటి, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ క్యాన్సర్లు ప్రధానంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా, 2024లో కొత్తగా నమోదైన కేసుల్లో 1.13 లక్షలకు పైగా నోటి క్యాన్సర్ కేసులే కావడం గమనార్హం.
- మహిళల్లో: రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు అధికంగా కనిపిస్తున్నాయి.
నివారణకు అవసరమైన జాగ్రత్తలు
నివేదికలో పేర్కొన్న సూచనలు:
- పొగాకు, ధూమపానం, మద్యపానం మానుకోవాలి.
- రోజువారీ జీవితంలో నడక, మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి.
- వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండి, తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.
- 30 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
ప్రభుత్వ చర్యలు
ఐసీఎంఆర్ ప్రకారం, క్యాన్సర్ నియంత్రణ చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా, అవగాహన కార్యక్రమాలు, ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతోంది.
Also Read : Date Seeds Interesting Updates : ఖర్జూర గింజల వల్ల ఇన్ని లాభాలున్నాయా?
