Uttam Kumar Reddy Shocking Comments : నదీ జలాల వినియోగంలో టెలిమెట్రి విధానం

అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింద‌న్న మంత్రి

Hello Telugu - Uttam Kumar Reddy Shocking Comments

Hello Telugu - Uttam Kumar Reddy Shocking Comments

Uttam Kumar Reddy : ఢిల్లీ – కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాలు ఎంతెంత వాడు కుంటున్నాయో నిర్దారించడానికి గాను టెలిమెట్రి పరికరాలు అమార్చాలన్న‌ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కు కేంద్రం ఆమోదించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్ల‌డించారు. ఇది స‌ర్కార్ సాధించిన ఘన విజయంగా ఆయన అభివర్ణించారు
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణా, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏ.రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లతో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

Uttam Kumar Reddy Comments

ఈ మేరకు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కృష్ణా (Krishna Water) జలాశయాల వినియోగంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి ఎప్పటి నుండో వివాదాస్పదంగా మారాయని, అటువంటి వివాదాస్పద అంశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో టెలిమెట్రి పరికరాలు అమర్చాలన్న తెలంగాణా ప్రభుత్వ డిమాండ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. త‌నతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి పట్టుపట్టి సాధించామన్నారు

ఇప్పటికే కొంత మేర పరికరాలు అమర్చినప్పటికి మొత్తం నీటి వినియోగంలో టెలిమెట్రి పద్ధతిని అమలు పరచేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు కు నిధులు మంజూరు చేసేందుకు కూడా తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశామ‌న్నారు. ఈ విధానం అమలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లు ఆయన వివరించారు. అదే విధంగా శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ని వివరించడంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కుడా డ్యామ్ పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు

అందుకు స్పందించిన కేంద్రం శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు తక్షణం పూను కోవాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించిందని ఆయన తెలిపారు. అంతే గాకుండా నదీ యాజమాన్యాల బోర్డుల విషయమై 2020 లో జరిగిన ఏపేక్స్ సమావేశంతో పాటు ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించామన్నారు. స్పందించిన కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల బోర్డులలో ఒకటి తెలంగాణాకు మరొకటి ఏపీకి ఉండే విదంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణకు, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంద్రప్రదేశ్ లో ఉండేలా నిర్ణయం తీసుకుందన్నారు. కృష్ణా-గోదావరి నదులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రాగా ఇరు రాష్ట్రాలకు చెందిన నిపుణుల కమిటీని వారం రోజుల్లో వేసి టైమ్ బౌండ్ ప్రోగ్రాంతో నెల రోజుల వ్యవధిలో వచ్చే నివేదిక‌ను అనుసరించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Also Read : Telangana Govt Strong Demands : 13 అంశాల‌ను ప్ర‌తిపాదించిన తెలంగాణ స‌ర్కార్

Exit mobile version