KTR Sensational Comments : బీఆర్ఎస్ ఏ పార్టీకి బి టీమ్ కాదు : కేటీఆర్

జైరాం రమేష్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

Hello Telugu - KTR Sensational Comments

Hello Telugu - KTR Sensational Comments

KTR : హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీపై నోరు పారేసుకున్న జై రాం ర‌మేష్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బి టీమ్ కాద‌ని స్ప‌ష్టం చేవారు. కాంగ్రెస్‌కు బీ-టీమ్‌ కాదు, బీజేపీకి కాదు మాది తెలంగాణ ప్రజల ఏ-టీమ్ అన్నారు. మంగ‌ళ‌వారం కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గల నిరంతర వైఫల్యాలకు ప్రధాన కారణం ఇదేనని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మాకు మద్దతివ్వకపోతే మీరు బీజేపీ పక్షాన ఉన్నట్లే అనే అహంకారపూరిత వైఖరి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను ఒంటరిని చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు.

KTR Key Comments on BRS Party

వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల వైఖరిపై జైరాం రమేష్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ఘాటుగా బదులిచ్చారు. జైరాం ఇలాంటి అహంకారమే మీ పార్టీని జాతీయ రాజకీయాల్లో విఫలం చేసింది. మాతో ఉంటేనే మిత్రులు, లేదంటే వాళ్ల వైపు ఉన్నట్లే అనే వాదన అసమర్థనీయం అని కేటీఆర్‌ సూటిగా చెప్పారు. తాము ఎవ‌రి ప‌క్షం వ‌హించ‌మ‌ని కేవ‌లం జ‌న ప‌క్షం వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను రాజకీయ ఆటల్లోకి లాగే బదులు, తమ పార్టీ ఎదుర్కొంటున్న వైఫల్యాలపై దృష్టి పెట్టాలని కేటీఆర్‌ జైరాం రమేష్‌కు హితవు పలికారు. భారతదేశ రాజకీయాలు కేవలం కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే నడుస్తున్నట్లుగా భావించడం వారి వైఫల్యాలకు మరో ఉదాహరణ అని ఆయన అన్నారు.

Also Read : Telangana High Court Shocking : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫ‌లితాలు ర‌ద్దు

Exit mobile version