Telangana High Court Shocking : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫ‌లితాలు ర‌ద్దు

తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

Hello Telugu - Telangana High Court Shocking

Hello Telugu - Telangana High Court Shocking

Telangana High Court : హైద‌రాబాద్ : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు చెప్పింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది . గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఒకవేళ సాధ్యం కాకపోతే, పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని స్ప‌ష్టం చేసింది. మంగ‌ళవారం విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఈ మేర‌కు పూర్వ ప‌రాలు, వాదోప‌వాద‌న‌లు విన్న అనంత‌రం ధ‌ర్మాస‌నం కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఒక ర‌కంగా రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు, తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఒంటెద్దు పోక‌డ‌కు చెంప పెట్టు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Telangana High Court – Group 1 Exams

గ‌త కొంత కాలంగా టీజీఎస్పీస్సీ నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష‌ల‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున అభ్య‌ర్థుల‌కు అన్యాయం జ‌రిగిన‌ట్లు కోర్టును ఆశ్ర‌యించారు. కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ లిస్టులో ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే ఎక్కువ మార్కులు వేసిన‌ట్లు వాపోయారు కొంద‌రు బాధితులు. ఇక ఈ కేసు విష‌యానికి వ‌స్తే కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇచ్చిన ఆదేశాలు పాటించక పోతే మొత్తం పరీక్షా ప్రక్రియను రద్దు చేసి, కొత్త పరీక్షలకు ఆదేశిస్తామని కోర్టు హెచ్చరించింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేసి, ఎనిమిది వారాల్లోపు ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఆదేశించింది. క‌మిష‌న్ 563 గ్రూప్-1 ఖాళీలను నోటిఫై చేసింది, కానీ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పిటిషన్లు వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్‌లో నియామకాన్ని నిలిపి వేసింది. తెలుగు-మీడియం పేపర్లకు తెలుగుయేతర మూల్యాంకనదారులను ఉపయోగించడ, మోడరేషన్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు లేక పోవడం వంటి పారదర్శకత లోపాన్ని ఆశావాదులు ఎత్తి చూపారు.

Also Read : Bigg Boss 9 Huge Remuneration : బిగ్ బాస్ -9 కంటెస్టెంట్స్ కు కాసుల పంట

Exit mobile version