KTR Guarantee Interesting : బాధిత రైతుల‌కు బీఆర్ఎస్ భ‌రోసా : కేటీఆర్

క‌డ్తాల్ లో ఆందోళ‌న చేప‌ట్టిన వారికి హామీ

hellotelugu-ktr

KTR : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్లో ఆర్ఆర్ఆర్, సోలార్ పవర్ ప్లాంట్లను నిరసిస్తూ బాధిత రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). మొన్న కొంత మంది రైతులు సోదరులు తెలంగాణ భవన్‌కు వచ్చారని చెప్పారు. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నదని, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్నడు ఇలా చేయ లేద‌న్నారు. వారి స్వంత ఆస్తులు పెంచుకునేందుకు రేవంత్ చేస్తున్న ఈ కుట్రలను అడ్డుకుంటాం అన్నారు. వారి అన్యాయాలకు దోచి పెట్టేందుకు ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు. మీకు అన్ని రకాల న్యాయ వ్యవస్థలో కోట్లాడేందుకు అండగా ఉంటామ‌న్నారు.

KTR Guarantee

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను తీసుకొని మళ్లీ తెలంగాణ భవన్‌కు రావాల‌ని కోరారు. అన్ని విధాలుగా సాయం చేస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుతీరాక అన్న వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు. రైతులు ఓ వైపు యూరియా అంద‌క నానా తంటాలు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా తాము రేయింబ‌వ‌ళ్లు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రూ తొంద‌ర‌పాటు ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. కాంగ్రెస్ అబ‌ద్ద‌పు హామీలు ఇచ్చి నిలువునా మోసం చేసింద‌న్నారు.

Also Read : TGPSC Group-2 Final Results : టీజీపీఎస్సీ గ్రూప్ -2 ఫ‌లితాలు విడుద‌ల

Exit mobile version