TGPSC : హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ ) కీలక ప్రకటన చేసింది. ఆదివారం గ్రూప్ -2 పరీక్షా ఫలితాలను వెల్లడించింది. తాత్కాలిక ఎంపిక జాబితాను రిలీజ్ చేశారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇదిలా ఉండగా గత మార్చి 11న విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా 783 నోటిఫైడ్ ఖాళీలకు 782 మంది అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. అదనంగా ఒక ఖాళీని నిలిపివేసినట్లు తెలిపారు. మరో వైపు 18 పోస్టులకు సంబంధించి వివిధ కారణాల రీత్యా కోర్టులో కేసులు ఉన్నాయని, అందుకే వాటి ఫలితాలను నిలిపి వేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల తుది తీర్పు వెలువడిన అనంతరం మిగతా మిగిలి పోయిన పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెబ్ సైట్ లో ఉంచుతామని తెలిపారు చైర్మన్.
TGPSC Group-2 Results Release
ఇదిలా ఉండగా ఇప్పటికే టీజీపీఎస్సీ (TGPSC) గ్రూప్ -1 లో ర్యాంకర్లను , ఎంపికైన వారిని ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ అందించిన జాబితా మేరకు రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళా వేదికగా జరిగిన కార్యక్రమంలో ఎంపికైన ప్రతి ఒక్కరికీ స్వయంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో పాటు సీఎస్ కె. రామకృష్ణా రావు అందజేశారు. కొత్తగా ఎంపికైన వారు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రతి ఒక్కరినీ గమనిస్తుంటారని, వారికి సేవలు నిస్వార్థంగా చేసిన వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేశారు.
Also Read : BCCI Committee Important Decision : బీసీసీఐ నూతన కార్యవర్గం కీలక నిర్ణయాలు
