BR Naidu : తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. పనిగట్టుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు తనకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. పదే పదే తన తీరు మార్చు కోవడం లేదన్నారు. తనకు తిరుపతిలో ఉండే నైతిక హక్కు, అర్హత లేదన్నారు బీఆర్ నాయుడు.
TTD Chairman BR Naidu Slams Bhumana Karunakar Reddy
తనను ఇక్కడ లేకుండా తిరుపతి వాసులు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ముంతాజ్ హోటల్ కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని బెదిరించారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ పెట్టి భూమిని లాక్కున్నారని ఇది మీ చరిత్ర కాదా అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల టీటీడీ నిధులను వైసీపీ నేతలు మింగేశారని మీపై విచారణ కొనసాగుతుందన్నారు.
మేం బోర్డులోకి వచ్చాక అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తున్నామని చెప్పారు బీఆర్ నాయుడు.
భూమన కరుణాకర్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : CM Chandrababu Warning : సీజన్ అయి పోయాక రుణాలు ఇస్తే ఎలా..?
