Hyderabad : హైదరాబాద్ – వినాయక చవితి పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది సీఎస్ రామకృష్ణా రావును. ఇందులో భాగంగా భారీ ఎత్తున వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా డీజీపీ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Hyderabad Traffic Restrictions
గణేష్ పండుగ సందర్భంగా ఆగస్టు 27 వరకు హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు చెప్పారు. గణేష్ విగ్రహాల రవాణా, అమ్మకాలను సులభతరం చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ధూల్‌పేటలో ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 7:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.
ట్రాఫిక్ ప్రణాళికలో భాగంగా భోయిగూడ కమాన్ , గాంధీ విగ్రహం మధ్య సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించ బోమని తెలిపారు. ఈ మార్గంలో గణేష్ విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు, గాంధీ విగ్రహం, పురానా పుల్ నుండి ప్రవేశం, భోయిగూడ కమాన్ క్రాస్ రోడ్ల ద్వారా తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు సిటీ పోలీస్ కమిషనర్.
గాంధీ విగ్రహం, పురానా పుల్ నుండి మంగళ్‌హాట్ వరకు ట్రాఫిక్‌ను టక్కర్‌వాడి టి జంక్షన్, జిన్సి చౌరస్తా ఘోడే-కే-ఖబర్ ద్వారా మళ్లిస్తారు వాహనాలను. సీతారాంబాగ్ నుండి మంగళ్‌హాట్ / పురానా పుల్ వరకు వాహనాలను భోయిగూడ కమాన్ ఎక్స్ రోడ్ల వద్ద కార్వాన్ రోడ్ – పురానా పుల్ ఎక్స్ రోడ్ – గాంధీ విగ్రహం వైపు లేదా అఘాపుర, దారుస్సలాం, అలాస్కా, ఎంజె బ్రిడ్జి, జుమేరాత్ బజార్ , పురానా పుల్ వైపు మళ్లిస్తారు.
విగ్రహ రవాణా సజావుగా సాగడానికి , మెరుగైన ట్రాఫిక్ నిర్వహణను నిర్ధారించడానికి మళ్లింపులకు సహకరించాలని, తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సీపీ ప్రయాణికులను కోరారు.
Also Read : AP CS Vijayanand – Huge Solar Plant : 5,842 ఎకరాలలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు
