Minister Seethakka : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్దం కానట్లు ఉందన్నారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటి అంటూ ప్రశ్నించారు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తన కోసం ఎవరూ ఇక్కడ ఎదురు చూడడం లేదన్నారు. నీ స్వంత చెల్లెలు కవిత నిన్ను నాయకుడిగా గుర్తించడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఉన్న మీ నాయినను అసెంబ్లీకి రమ్మను చర్చిస్తామన్నారు.
Minister Seethakka Slams KTR
తెలంగాణ పేరుతో మీరు చేసిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. మంత్రి సీతక్క (Minister Seethakka) మీడియాతో మాట్లాడారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారని అనుకోవడం భ్రమ అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతలకు, ప్రత్యేకించి కల్వకుంట్ల ఫ్యామిలీకి ఓ అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు చేసిన మీరు చేసిన నిర్వాకానికి తీర్చలేక నానా తంటాలు పడుతున్నామని ధ్వజమెత్తారు సీతక్క.
ఇకనైనా సోయి ఉండి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. అడ్డగోలు విమర్శలు కాకుండా పూర్తి వివరాలతో అసెంబ్లీకి రావాలని స్పష్టం చేశారు. ఎవరు వచ్చినా శాసన సభలో తాము చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు . అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడిన వాళ్లకు తమను ప్రశ్నించే నైతిక హక్కు, అర్హత లేనే లేదన్నారు మంత్రి దాసరి సీతక్క.తమకేదో తెలంగాణపై ప్రత్యేక హక్కు ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
Also Read : MP Kiran Kumar Reddy Fired on KTR : ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయి కేటీఆర్ కు లేదు
