రాజ్యాంగ వ్యవ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

hellotelugu-MaheshKumarGoud

హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందన్నారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని, కానీ మోదీ వ‌చ్చాక ప్రతిపక్షాల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టారని ఆరోపించారు. మంగ‌ళ‌వారం మ‌హేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును కాపాడాలని ప్రయత్నించిన రాహుల్ గాంధీని కూడా ఇబ్బంది పెట్టార‌ని అన్నారు. బీహార్,, వెస్ట్ బెంగాల్ లో మాదిరి తెలంగాణలో ఓట్ల తొలగింపున‌కు ప్లాన్ చేశార‌ని ఆరోపించారు. తెలంగాణలో 3 కోట్ల 38 లక్షల ఓట్లు ఉంటే 73 లక్షల పైగా ఓట్లు తొలగించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓట్లు కోల్పోయిన వారిలో బీద‌లే ఎక్కువ‌గా ఉన్నార‌ని అన్నారు.

2002 కండిషన్ పెట్టడం వల్ల ఎన్యూమరేషన్ ఫాం ఇవ్వలేని పరిస్థితి నెల‌కొందన్నారు. ఆన్ మ్యాపింగ్ 32 లక్షల 37 వేల ఓట్లు ఉన్నాయ‌న్నారు. 60 లక్షల పైగా ఓట్లు డౌట్ ఫుల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. Bla లు 35 వేల ఓట్లకు రిసిపిట్ ఇచ్చారని, 13 వేల 100 మంది అని ఎలక్షన్ కమిషన్ చూపిస్తోందని దీనిపై సీఈఓ వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. 2002 వివరాలు కాకుండా తాజాగా వివ‌రాలు స‌మ‌ర్పిస్తే, స‌రిగా ఉంటే ఓటు హ‌క్కు క‌ల్పించాల‌ని మ‌హేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. కోటి 60 లక్షల ఓటర్లు ఎందుకు క్వచన్ మార్క్ గా ఉంద‌న్నారు. ప్రతి పౌరుడు ఓటు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. సర్ కి ఇంకా సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. 92 లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా ఉన్నాయన్నారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆరోపించ‌చారు.

Exit mobile version