హెచ్-1బి వీసాలపై యుఎస్ కాంగ్రెస్ లో బిల్లు

3 ఏళ్ల పాటు విరామం కోసం ప్ర‌వేశ పెట్టారు

helloteugu-H-1BVissa

అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొలువు తీరాక అమెరిక‌న్ల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఆపై ప్ర‌వాస భార‌తీయుల‌కు శాపంగా మారుతున్నాయి త‌న చ‌ర్య‌లు అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మ‌రో బాంబు పేల్చారు. ప్ర‌ధానంగా హెచ్-1బి వీసాల‌పై కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఏకంగా ఇక నుంచి ప్ర‌తి ఏటా ప్ర‌క‌టించే హెచ్ 1బి వీసాలు జారీ చేయ‌డం కాకుండా మూడు సంవ‌త్స‌రాల పాటు విరామం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇవాళ ఇందుకు సంబంధించిన బిల్లును యూఎస్ కాంగ్రెస్ లో ప్ర‌వేశ పెట్టారు. ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ బిల్లు ప్ర‌ధానంగా హెచ్-1బి కార్యక్రమానికి సంస్కరణలను ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా వార్షిక పరిమితిని 65,000 నుండి 25,000కు తగ్గించడం, సంవత్సరానికి కనీస వేతనం 2,00,000 డాలర్లుగా నిర్ణయించడం, హెచ్-1బి వీసా హోల్డర్లు తమపై ఆధారపడిన వారిని యూఎస్‌కు తీసుకు రాకుండా నిరోధించడం వంటివి ఉన్నాయి.

రిపబ్లికన్ చట్టసభ్యుల బృందం హెచ్-1బి వీసా కార్యక్రమానికి మూడేళ్ల విరామం కోసం యూఎస్ కాంగ్రెస్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టడం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ బిల్లును ప్ర‌వేశ పెట్ట‌డం ప్ర‌ధాన ఉద్దేశం అమెరికన్ కార్మికుల స్థానంలో చౌక విదేశీ కార్మికులను నియమించడానికి ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాదిస్తూ వ‌స్తున్నారు. అరిజోనాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఎలి క్రేన్ ‘ఎండ్ హెచ్-1బి వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026’ను ప్రవేశ పెట్టగా, మరో ఏడుగురు రిపబ్లికన్ చట్టసభ్యులు దీనికి సహ-ప్రాయోజకులుగా ఉన్నారు. ఈ బిల్లు H-1B ప్రోగ్రామ్‌లో సంస్కరణలను ప్రతిపాదిస్తోంది. కాంగ్రెస్ సభ్యులు బ్రియాన్ బాబిన్, బ్రాండన్ గిల్, వెస్లీ హంట్, కీత్ సెల్ఫ్ (వీరందరూ టెక్సాస్‌కు చెందినవారు), ఆండీ ఓగ్లెస్ (టెన్నెస్సీ), పాల్ గోసర్ (అరిజోనా) టామ్ మెక్‌క్లింటాక్ (కాలిఫోర్నియా) ఈ బిల్లుకు తొలి సహ-ప్రాయోజకులుగా సంతకాలు చేశారు.

అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు విదేశీ కార్మికులను నియమించు కోవడానికి H-1B వీసా ప్రోగ్రామ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తాయి. టెక్నాలజీ కార్మికులు, వైద్యులతో సహా భారతీయ నిపుణులు, H-1B వీసా హోల్డర్లలో అతిపెద్ద సమూహాలలో ఒకటిగా ఉన్నారు.

Exit mobile version