హైదరాబాద్ : నారాయణపేట జిల్లాకు చెందిన ఆకుల శ్రీలతకు కోలుకోలేని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కె. శివ కుమార్ రెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గతంలో కేసు వేసింది. తనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తన దావాను తిరస్కరించింది. గతంలో శివ కుమార్ రెడ్డితో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా దీనిపై విచారణ చేపట్టింది నాంపల్లి కోర్టు. ఇది తమ పరిధిలోకి రాదని, ప్రజా ప్రతినిధుల కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. దీంతో ఆకుల శ్రీలతకు బిగ్ షాక్ తగిలింది.
కాంగ్రెస్ నాయకుల తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదించారు. ఈ కేసును ఉన్నపళంగా తీసుకుని సమన్లు ఇచ్చే పరిధి, అధికారం తమకు లేదని పేర్కొంది కోర్టు. ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో పిటిషన్ ను మరోసారి దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ ను తిప్పి పంపుతున్నట్లు పేర్కొంది. నిజానికి ఈ పిటిషన్లో నాలుగో నిందితురా లిగా మీనాక్షి ఉన్నందుకే ఆ కేసును అఫిడవిట్ లో వెల్లడించ లేదని, దీని కారణంగా దానిని అడ్డం పెట్టుకుని మధ్యప్రదేశ్ లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకకు గురైంది. అంతకు ముందు ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ రెడ్డిపై 2022లో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే క్రమంలో 2023లో బెంగళూరరులోని కుబ్బన్ పార్క్ రాజాలో ఆకుల శ్రీలత ఫిర్యాదు చేసింది.
