Bhumana Karunakar Reddy Shocking Comments : బీఆర్ నాయుడు ప్ర‌వ‌క్త లాగా మాట్లాడితే ఎలా..?

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

Hello Telugu - Bhumana Karunakar Reddy Shocking Comments

Hello Telugu - Bhumana Karunakar Reddy Shocking Comments

Bhumana Karunakar Reddy : తిరుప‌తి – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి మాజీ చైర్మ‌న భూమన క‌రుణాక‌ర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్ గా ఉన్న బీఆర్ నాయుడు పై భ‌గ్గుమ‌న్నారు. త‌ను ప్ర‌వ‌క్త లాగా మాట్లాడుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నాపై ఆరోపణలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు ఇక్క‌డ చెల్లుబాటు కావ‌న్నారు. నాస్తికుడు, క్రైస్తవుడు అని విచక్షణారహిత మాటలు పలుకుతుండ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఒక బాద్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు, చిల్ల‌ర మ‌ల్ల‌ర మాట‌లు మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు భూమ‌న క‌రుణాకర్ రెడ్డి.

Bhumana Karunakar Reddy Slams TTD Chairman

ఈ సంద‌ర్బంగా బీఆర్ నాయుడును ఏకి పారేశారు. వ్య‌క్తిగ‌తంగా కామెంట్స్ చేయ‌డం వెంట‌నే మానుకోవాల‌ని, లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈ కొత్త అవతారమూర్తి బొల్లినేని నాయుడు ఆరోపణలకు భయపడేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తల వంచేది లేదన్నారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షునిగా భక్తులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాన‌ని, నిల‌దీస్తూనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తి రోజూ వేలాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు క‌లిగినా తాను ఊరుకో బోనంటూ స్ప‌ష్టం చేశారు మాజీ చైర్మ‌న్.

Also Read : MLA Komatireddy Shocking Comments : రేవంత్ రెడ్డి భాష దారుణం – రాజగోపాల్ రెడ్డి

Exit mobile version