Bhumana : తిరుపతి – టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana) సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ పై. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. పరమత సహనం పాటించమని హిందూ ధర్మమే చెబుతుందని , కానీ మనుషుల మధ్య భేదాలు సృష్టించేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. టీటీడీలో అన్య మతస్తులు ఉన్నారంటూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పక్కనే పాలక మండలి సభ్యుడిని పెట్టుకుని కామెంట్స్ చేయడం సబబు కాదన్నారు. ఏ మతం ఇంకొక మతాన్ని కించ పర్చమని బోధించదన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Bhumana Strong Reaction
టీటీడీలో తాము ఉన్నప్పుడే బాగుండేదని కానీ ఇప్పుడంతా ఎవరి ఇష్టానుసారం వారిదే నడుస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ చర్య తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంపై డాడి లాగా తాము భావిస్తున్నామని అన్నారు . శనివారం తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకోసారి ఇలాగే మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పవిత్రమైన ఆలయానికి వచ్చిన మీరు దర్శనం చేసుకోవాలే తప్పా రాజకీయాలు మాట్లాడతారా అంటూ నిలదీశారు. ఇది పూర్తిగా ధర్మానికి , టీటీడీ నియమ నిబంధనలకు విరుద్దమన్నారు. తెలుసుకుంటే మంచిదన్నారు. ఇకనైనా బండి సంజయ్ కుమార్ పటేల్ తన మాటల తీరును మార్చుకుంటే మేలని హితవు పలికారు.
Also Read : Hyderabad to Amaravati Approved : హైదరాబాద్ టు అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
