MSK Prasad : అమరావతి : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ (MSK Prasad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే వరల్డ్ కప్ -2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఉమెన్ క్రికెటర్ శ్రీ చరణి కీ రోల్ పోషించిందన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆమెపై ప్రశంసలు కురించారు. ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుపులో తెలుగమ్మాయి కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉందని, అంతకు మించిన ఆనందం కలుగుతోందన్నారు ఎమ్మెస్కే ప్రసాద్. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీ చరిణి ఇవాళ ఈ స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రత్యేకించి ఆయన ఐసీసీ చైర్మన్ జే షాను కొనియాడారు. ఆయన వచ్చాకనే మహిళా క్రికెట్ కు మరింత ఆదరణ పొందిందన్నారు.
MSK Prasad Praises Women Cricketer Sricharani
ఆయన లేక పోయి ఉండి ఉంటే ఇంత ఆదరణ లభించి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఎంఎస్కే ప్రసాద్. దేశానికి శ్రీచరిణి రూల్ మోడల్ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దేశంలోనే మొట్టమొదటి మహిళల క్రికెట్ అకాడమీ ఏపీలోనే ప్రారంభమైందని చెప్పారు మాజీ చీఫ్ సెలెక్టర్. ఈ సందర్బంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలు, యువతులు ధైర్యంగా ముందుకు రావాలని, గ్రౌండ్ కు వచ్చి క్రికెట్ ను ప్రాక్టీస్ చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెస్కే ప్రసాద్. ప్రస్తుతం బీసీసీఐ పెద్ద ఎత్తున మహిళా క్రికెటర్లను ప్రోత్సహిస్తోందని, వారికి ఊహించని రీతిలో పారితోషకం ఇస్తోందని స్పష్టం చేశారు.
Also Read : Harish Rao Fired on CM Revanth : రేవంత్ తమ్ముళ్లు తప్ప ఎవరూ సంతోషంగా లేరు
