Bhatti Vikramarka : హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్బంగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం, మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన సంధర్భంగా తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలు, చేపట్టిన సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజా పాలన విజయోత్సవాలు అని పేరు పెట్టింది. దీనిపై ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో కలిసి సమీఓ చేపట్టారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు.
DY CM Bhatti Vikramarka Comments
ప్రజా పాలన విజయోత్సవాలను ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర, అభివృద్ధి ప్రయాణం, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉండాలని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రార్క (Bhatti Vikramarka).పెట్టుబడిదారులను ఈ విజయోత్సవాలకు ఆహ్వానిస్తూ, పెద్ద ఎత్తున పరిశ్రమల ఒప్పందాలు కుదిరేలా అనుకూల వాతావరణం సిద్ధం చేయాలని సూచించారు . దుబాయ్ ఫెస్టివల్ మాదిరిగా నగరానికి దూరంగా ఉన్న ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక ప్రదర్శనల ఏర్పాటు పై అధికారులు పరిశీలించాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
సీనియర్, జూనియర్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కమిటీలు రూపకల్పన చేసి, పనులను విభజించి, నాణ్యతతో సకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరం ఆధునికత, మూసి పునర్జీవనం, ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం వంటి అంశాలపై తెలంగాణ భవిష్యత్ దిశను ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.
Also Read : CM Chandrababu Interesting Comments : ఏపీ టీం చేసిన కృషి ప్రశంసనీయం : సీఎం
