CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చేసిన ముందస్తు హెచ్చరికలు చాలా వరకు మేలు చేసిందన్నారు సీఎం. ఈ సందర్బంగా ఇందులో పాలు పంచుకున్న మంత్రులు, సీఎస్, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగుల సమన్వయం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ఈ సందర్బంగా టీంగా ఏర్పడి చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
CM Chandrababu Appreciates
ప్రజలను అలెర్ట్ చేయడం, నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి పునరావాసం కల్పించడం, తుఫాన్ తగ్గాక సాధారణ పరిస్థితులు తీసుకు రావడంపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పారు. టెక్నాలజీ వినియోగం మూలంగా తుఫాను రక్షణ – సహాయక చర్యల్లోపాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ అనుభవం మరింత మేలు చేకూరుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక పంట నష్టం అంచనాలను కూడా త్వరితగతిన పూర్తిచేసి కేంద్రానికి వీలైనంత త్వరగా నివేదికలు సమర్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు ఉన్నతాధికారులను.
ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై కూడా ప్రస్తావించారు సీఎం. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా, నిర్దేశించుకున్న సమయానికి పూర్తి కావాలని స్పష్టం చేసారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని చెప్పారు.
Also Read : KTR Gets Important Invitation : ప్రపంచ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం
