IBomma Founder Ravi Arrest Interesting : ఛాలెంజ్ చేశాడు చంచ‌ల్ గూడ జైలు పాల‌య్యాడు

విశాఖ‌కు చెందిన ఐబొమ్మ య‌జ‌మాని ఇమ్మ‌డి ర‌వి

Hello Telugu - IBomma Founder Ravi Arrest Interesting

Hello Telugu - IBomma Founder Ravi Arrest Interesting

IBomma : హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాడు ఐబొమ్మ (IBomma) య‌జమాని ఇమ్మ‌డి ర‌వి. టాలీవుడ్ ను షేక్ చేశాడు. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, న‌టీ న‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ప్ర‌త్యేకించి పోలీసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చివ‌ర‌కు పోలీసుల‌కు స‌వాల్ విసిరాడు. దమ్ముంటే త‌న‌ను ప‌ట్టుకోవాల‌ని . చివ‌ర‌కు భార్య‌తో ఉన్న విభేదాలే త‌న‌ను ప‌ట్టించేలా చేశాయి. విచిత్రం ఏమిటంటే త‌ను క‌రేబియ‌న్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ‌ను నిర్వ‌హించాడు. చుక్క‌లు చూపించాడు. చివ‌ర‌కు చిక్కాడు. ప్ర‌స్తుతం చంచ‌ల్ గూడ జైలులోకి వెళ్లాడు. ఇక త‌న గురించి వివ‌రాల‌లోకి వెళితే, త‌న పూర్తి పేరు ఇమ్మ‌డి ర‌వి కుమార్. త‌న స్వ‌స్థ‌లం విశాఖ‌ప‌ట్నం . సైబ‌ర్ సెక్యూరిటీ ఎనాలిస్ట్, ఎథిక‌ల్ హ్యాక‌ర్ కోర్సు పూర్తి చేశాడు. ఆయా రంగాల‌లో అనుభ‌వం పొందాడు. వృత్తి ప‌రంగా కొత్త సినిమాలను భద్రత పరిచే క్లౌడ్ ఫ్లేర్ గా ప‌ని చేశాడు.

IBomma Founder Ravi Arrest

ఓటిటి సర్వర్లను చాలా తేలికగా పైరసీ చేసి HD క్వాలిటీలో ఇబొమ్మ, బప్పం వంటి వెబ్సైట్లో పెడుతూ వ‌చ్చాడు. ఇబొమ్మ, బప్పం వెబ్ సైట్లను ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెల 37 లక్షల మంది వీక్షిస్తున్నారు.
పైరసీ వెబ్సైట్లలో ఇబొమ్మ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. తన సంపద అంత ఇబొమ్మ వెబ్సైట్ ద్వారా వచ్చే ఇల్లీగల్ బెట్టింగ్స్ యాడ్స్, ప్రమోషన్స్ ద్వారానే ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్టు సమాచారం. త‌న‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కూక‌ట్ ప‌ల్లిలోని త‌న నివాసంలో సోదాలు చేప‌ట్టారు. రూ. 3 కోట్ల న‌గ‌దు తో పాటు హార్డ్ డిస్క్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే గతంలో పలు రాష్ట్రాలలో జరిగిన సైబర్ కేసులను సైతం ఇతని ద్వారానే పలు సైబర్ కేసులను పోలీసులు ఛేదించారు. నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌గా చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు.

Also Read : Dipankar Bhattacharya-Bihar Victory : బీహార్ లో ఎన్డీయే విక్ట‌రీ అంతులేని మిస్ట‌రీ

Exit mobile version