Hero Rana – ED Investigation : రానాను నాలుగు గంట‌ల పాటు ఈడీ విచార‌ణ‌

బ్యాంకు లావాదేవీల‌పై పూర్తి వివ‌రాలు ప‌రిశీల‌న

Hello Telugu - Hero Rana - ED Investigation

Hello Telugu - Hero Rana - ED Investigation

Hero Rana : హైద‌రాబాద్ – బెట్టింగ్ యాప్స్ కేసులో సోమ‌వారం హైద‌రాబాద్ లోని ఈడీ కార్యాల‌యానికి విచార‌ణ నిమిత్తం హాజ‌ర‌య్యారు ప్ర‌ముఖ న‌టుడు ద‌గ్గుబాటి రానా (Hero Rana). విచార‌ణ‌కు రావాల్సిందిగా గ‌తంలోనే నోటీసులు జారీ చేసింది. కానీ త‌న‌కు షూటింగ్ ఉంద‌ని, వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, త‌న‌కు స‌మ‌యం కావాల‌ని కోరాడు. దీనికి ఈడీ ఓకే చెప్పింది. చివ‌ర‌కు ఆగ‌స్టు 11న ఈడీ ముందు హాజ‌ర‌వుతాన‌ని తెలిపాడు. ఇందులో భాగంగా ఇవాళ త‌ను అధికారుల ముందుకు వ‌చ్చాడు. ఈ సంద‌ర్బంగా నాలుగు గంట‌ల‌కు పైగా న‌టుడిని విచారించింది. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.

Hero Rana Daggubati – ED Investigation

ఇదిలా ఉండ‌గా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్ప‌టికే ప్ర‌ముఖ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌కాశ్ రాజ్ హాజ‌రయ్యారు. తాము ఎలాంటి అక్ర‌మంగా నిర్వ‌హించే బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోష‌న్ చేయ‌లేద‌ని ప్ర‌క‌టించారు. తాను గ‌తంలో చేశాన‌ని, 2017తో ఒప్పందం ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలిపాడు ప్ర‌కాశ్ రాజ్. మ‌రో వైపు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ . ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన గేమింగ్ యాప్స్ కే తాము ప్ర‌మోష‌న్ చేశామ‌ని చెప్పాడు. ఇదే కేసుకు సంబంధించి న‌టీ న‌టుల‌తో పాటు సోష‌ల్ మీడియా ఇన్ఫ్యూయ‌ర్స్ కు కూడా నోటీసులు ఇచ్చింది ఈడీ.

కాగా ప్రకాష్ రాజ్‌ను ఆరు గంటల పాటు ప్రశ్నించగా, విజయ్ దేవరకొండను నాలుగు గంటల పాటు విచారించారు. నటి మంచు లక్ష్మిని ఆగస్టు 13న ED ముందు హాజరు కావాలని కోరింది. జంగల్ రమ్మీ, జీత్ విన్, లోటస్ 365 వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : Mahavatar Narsimha Success : మ‌హావ‌తార్ న‌ర‌సింహ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version