Bee Bite : తేనెటీగ కాటు ఒక్కసారిగా తీవ్రమైన నొప్పిని కలిగించడంతో పాటు, దురద, వాపు, మంటను కలిగిస్తుంది. అయితే చాలామంది దీనిపై భయంతో ఉండటం కనిపిస్తుంటుంది. కానీ ఆయుర్వేద నిపుణుల మాటల్లో చెప్పాలంటే – తేనెటీగ కాటు పెద్ద సమస్య కాదని, కొన్ని ఇంటి చిట్కాలతోనే తక్షణ ఉపశమనం పొందవచ్చని అంటున్నారు.
Bee Bite – ఇంట్లోనే పొందగలిగే సహజ నివారణలు:
1. బేకింగ్ సోడా పేస్ట్
వాపును తగ్గించే గుణాలు కలిగిన బేకింగ్ సోడా తేనెటీగ కాటుకు (Bee Bite) మంచి పరిష్కారం. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ తయారు చేసి కాటు మీద రాయాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
2. తేనె (హనీ)
సహజ యాంటీబాక్టీరియల్ గుణాలున్న తేనె కాటు కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. కాస్త తేనెను కాటు స్థానంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
3. ఐస్ ప్యాక్ లేదా కోల్డ్ కంప్రెస్
చల్లటి ప్యాక్ వలన నొప్పి, వాపు తక్షణంగా తగ్గుతుంది. ఐస్‌ను సాఫ్ట్ గుడ్డలో చుట్టి ప్రభావిత ప్రాంతంపై 10-15 నిమిషాలు ఉంచాలి.
4. ఆపిల్ సైడర్ వెనిగర్
తేనెటీగ కాటు (Bee Bite) విషాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. వెనిగర్‌లో దూదిని ముంచి కాటు గాయం మీద అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
5. తులసి ఆకుల రసం
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన తులసి కాటు ప్రాంతంలో ఉపశమనం ఇస్తుంది. తాజా ఆకులను నూరి రసాన్ని కాటు మీద రాయాలి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
కాటుతో పాటు శ్వాసలో ఇబ్బంది, తీవ్రమైన వాపు, తల తిరగడం, మూర్చ రావడం లేదా జ్వరం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
గమనిక: ఈ నివారణలు సాధారణ పరిస్థుల్లో ఉపయోగపడతాయి. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రతిస్పందన మారవచ్చు. మీ ఆరోగ్యానికి అనుసరించి సరైన వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.
Also Read : Periods Pains Dangerous : పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నారా ఈ చిట్కాతో వెంటనే రిలీఫ్
