Hydraa Chief Ranganath Shocking Comments : రూ. 50 వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం

923 ఎకరాల ప్ర‌భుత్వ భూమిని ర‌క్షించాం

Hello Telugu - Hydraa Chief Ranganath Shocking Comments

Hello Telugu - Hydraa Chief Ranganath Shocking Comments

Ranganath : హైద‌రాబాద్ : భారీ వ‌ర్షాలు ఒక వైపు క‌బ్జాల తొల‌గింపు మ‌రో వైపు ఇలా మ‌ల్టీ టాస్కుతో హైడ్రా ప‌ని చేస్తోంద‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (Ranganath) తెలిపారు. హైడ్రా ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ రూ. 50 వేల కోట్ల విలువైన 923.14 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడామ‌న్నారు. ఇలా చెరువులు, కాలువ‌ల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి.. ప్ర‌కృతిని ప‌రిర‌క్షించ‌డం ద్వ‌రా న‌గ‌రానికి మంచి భ‌విష్య‌త్తును ఇవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌న్నారు. హైడ్రా కార్య‌క‌లాపాల గురించి ఆయ‌న వివ‌రించారు. ఈ మేర‌కు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు హైడ్రా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌న్నీ భ‌విష్య‌త్ త‌రాల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. హైడ్రా ప‌ట్ల న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికి మంచి అభిప్రాయం ఉంద‌ని.. ఒక‌రిద్ద‌రు విమ‌ర్శించినా భ‌విష్య‌త్తులో వాళ్లు కూడా మెచ్చుకుంటార‌ని అన్నారు.

Hydraa CHief AV Ranganath Comments

త‌న స‌ర్వీసులో విమ‌ర్శ‌లు కొత్త కాద‌ని త‌ర్వాత రియ‌లైజ్ అయిన ఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయ‌న్నారు. 2007వ సంవ‌త్స‌రం విజ‌య‌వాడలో జ‌రిగిన‌ అయేషా మీరా హ‌త్య కేసులో నిందితుడిగా స‌త్యంబాబును గుర్తించ‌డంతో పాటు న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య కేసులో నిందితుల‌కు శిక్ష ప‌డేలా చేసిన ద‌ర్యాప్తులే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇప్పుడు హైడ్రా చ‌ర్య‌లు కాస్త క‌ఠినంగా అనిపించినా.. న‌గ‌ర భ‌విష్య‌త్తు బాగుండాలంటే త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు. గొలుసుక‌ట్టు చెరువుల‌ను, కాలువ‌ల‌ను, ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడు కోలేక‌పోతే ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంద‌ని హెచ్చ‌రించారు ఏవీ రంగ‌నాథ్.

Also Read : Lakshma Reddy Challenge : ప్ర‌భుత్వ భూమి అక్ర‌మ బ‌దిలీపై పిటిష‌న్

Exit mobile version