బండి సంజ‌య్ కొడుకు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

మధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని కోరిన బండి భ‌గీర‌థ్

hellotelugu-BandiBhageerathCase

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్ పై పోక్సో కేసు న‌మోదైంది. త‌క్ష‌ణ‌మే త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పాటు మ‌హిళ‌లు, ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళ‌న చేప‌ట్టాయి కూడా. దీంతో గ‌త్యంత‌రం లేక కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంతా అయి పోయాక చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేర‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి కూక‌ట్ ప‌ల్లి డీసీపీగా ఉన్న రితిరాజ్ గైక్వాడ్ ను నియ‌మించారు. ఈ మేర‌కు ఆమె రంగంలోకి దిగారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేసు న‌మోదైనా ఆచూకీ దొరక‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఈ త‌రుణంలో త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ఉండేందుకు గాను బిగ్ ప్లాన్ వేశారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

మంగ‌ళ‌వారం ఉన్న‌ట్టుండి బండి సంజ‌య్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని అరెస్ట్ చేయ‌కుండా ఉండేందుక‌ని దావా దాఖ‌లు చేశారు.. ఈ నెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. హైద‌రాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఒక ‘పోక్సో’ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం క‌ల‌క‌లం రేపింది. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతుండటంతో, ఈ పిటిషన్‌ను హైకోర్టు ‘వెకేషన్ బెంచ్’ ముందు దాఖలు చేశారు. ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై భగీరథ్ ప్రస్తుతం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో, ఈ కేసు తీవ్రమైన మలుపు తిరిగింది.

హోంశాఖ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, భగీరథ్‌పై నమోదైన కేసు దర్యాప్తును ప్రారంభించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్‌ను ఆదేశించారు. మే 8, 2026న ఫిర్యాదు నమోదైనప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు

Exit mobile version