ఏవీఎం సంస్థ అధినేత శ‌ర‌వణ‌న్ క‌న్నుమూత

కోలీవుడ్ లో అలుముకున్న విషాదం

hellotelugu-AVMSaranan

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది. ప్ర‌ముఖ ఏవీఎం స్టూడియోల నిర్వాహ‌కుడు, దిగ్గ‌జ నిర్మాత ఎం. శ‌ర‌వ‌ణ‌న్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 86 ఏళ్లు. శరవణన్ 1946లో ఏవీఎం స్టూడియోలను స్థాపించారు. ఆయ‌న తండ్రి ఏవీ మెయ్య‌ప్ప‌న్ . ఆయ‌న పూర్తి పేరు మెయ్య‌ప్ప చెట్టియార్. త‌న కుమారుడే ఈ శ‌ర‌వ‌ణ‌న్. ఆయన నాయకత్వంలో ఏవీఎం ప్రొడక్షన్స్ తమిళం, ఇతర భాషలలో విమర్శకుల ప్రశంసలు పొందిన, వాణిజ్య పరంగా విజయవంతమైన విభిన్న చిత్రాలను అందించింది.

ఏవీఎం త‌న ఇంటి పేరుగా మార్చుకున్నారు శ‌ర‌వ‌ణ‌న్. తమిళ‌నాడులోనే కాదు దేశంలోనే అత్యంత పేరు పొందిన సినీ నిర్మాణ సంస్థ‌ల‌లో ఏవీఎం ఒక‌టిగా పేరు పొందింది. దీని వెనుక శ‌ర‌వ‌ణ‌న్ కృషి ఉంది. నానుమ్ ఒరు పెన్ , సంసారం అతు ఎక్తిల్ వంటి టైంలెస్ క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్ నటించిన శివాజీ, ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన‌ వెట్టైకరన్, సంగీత ప్రేమకథ మిన్సార కనవు , సూర్య న‌టించ‌చిన‌ అయాన్ వంటి బ్లాక్ బస్టర్‌లు మూవీస్ కూడా ఉన్నాయి.

ఏవీఎం స్టూడియోస్ ద్వారా ఎంద‌రో న‌టీ న‌టులకు గుర్తింపు ల‌భించింది. వారికి మ‌రింత గౌర‌వాన్ని తీసుకు వ‌చ్చేలా చేసింది. సూప‌ర్ స్టార్ లుగా, ప‌నివంతులైన నిపుణులుగా త‌మ కెరీర్ ను ఈ సంస్థ ద్వారా పేరు పొందారు. కాగా శరవణన్ తన తండ్రి స్థాపించిన స్టూడియో వారసత్వం, నైతికతను జాగ్రత్తగా కాపాడుకుంటూ వ‌చ్చారు. ఇటీవలి సంవత్సరాలలో కుటుంబ యాజమాన్యంలోని బ్యానర్ కార్యకలాపాలను త‌న‌ కుమారుడు ఎంఎస్ కుగన్ నిర్వహిస్తున్నారు. శ‌ర‌వ‌ణ‌న్ మృతి ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ , ర‌జ‌నీకాంత్, విజ‌య్, త‌దిత‌రులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

Exit mobile version