టీచ‌ర్ల‌పై దాడులు చేప‌ట్ట‌డం అప్ర‌జాస్వామికం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి నారా లోకేష్

hellotelugu-NaraLokesh

అమ‌రావ‌తి : త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు వ‌చ్చిన టీచ‌ర్ల‌పై వైసీపీ గూండాలు దాడుల‌కు పాల్ప‌డ‌డం అప్ర‌జాస్వామిక‌మని పేర్కొన్నారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. అందరూ దైవంలా భావించే గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ ఉపాధ్యాయులను గౌరవిస్తారు అనుకోవడం భ్ర‌మ ప‌డ‌టం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. త‌న‌కు ప‌వ‌ర్ కావాల‌ని కానీ పార్టీ శ్రేణుల‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు ప‌నుల‌కు వాడుకోవ‌డం వెన్న‌తో పెట్టిన విద్య అన్నారు . అత్యుత్తమ ఆటతీరుతో మన రాష్ట్రం, మన దేశం సత్తా ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో భ‌ర్తీ చేస్తే ఓర్చుకోలేక పోతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు నారా లోకేష్‌.

ఎలాంటి ఆధారాలు లేకుండా విచార‌ణ జ‌రిపించాల‌ని అన‌డం, త‌న ప‌త్రిక‌, ఛాన‌ల్ ను అడ్డం పెట్టుకుని నీలి రాత‌లు రాయించ‌డం, అదే ప‌నిగా ప్ర‌సారం చేయ‌డం ఒక అల‌వాటుగా మారింద‌న్నారు. మెగా డీఎస్సీలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ దుర్బుద్ధి ఏమిటో బ‌య‌ట ప‌డింద‌న్ఆన‌రు.  జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారన్నారు. క్రీడలతో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగడం దారుణ‌మ‌న్నారు.

రౌడీ షీటర్లు,  గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయట పెట్టింద‌న్నారు. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదని హెచ్చ‌రించారు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.

Exit mobile version