Asia Cup : దుబాయ్ : మరో క్రికెట్ సమరానికి వేదికైంది దుబాయ్. ఈసారి ఎలాగైనా సరే ఆసియా కప్ ను చేజిక్కించు కోవాలని ప్రయత్నం చేస్తోంది భారత జట్టు. ఇప్పటికే బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. దమ్మున్న యువ ఆటగాళ్లతో రెడీ అవుతోంది. కేవలం ఒకే ఒక రోజు మిగిలింది ఈ టోర్నీ ప్రారంభం అయ్యేందుకు . ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున సెలిబ్రిటీలు చేరుకున్నారు దుబాయ్ కి. గతంలో కంటే ఈసారి ఆసియా కప్ కు సంబంధించి ప్రైజ్ మనీని భారీగా పెంచారు.
Asia Cup 2025 Updates
ప్రపంచంలోని టాప్ 10 ట్వంటీ20 జట్లలో ఐదు జట్లు మంగళవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభమయ్యే 17వ ఆసియా కప్‌లో పోటీపడతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కలిసి ఆడనుంది. ఇండియా హాట్ ఫెవరేట్ గా ఉంది. భారత్ తో పాటు శ్రీలంక, పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20 ర్యాంకింగ్స్‌లో 7 నుంచి 10 స్థానాలలో ఉన్నాయి ఈ ఆఖరి జట్లు.
నాలుగు గ్రూపులతో ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో వారితో పాటు హాంకాంగ్, యూఏఈతో పాటు తొలిసారిగా ఎంట్రీ ఇస్తోంది ఒమన్. ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా మూడు అసోసియేట్ జట్లు అర్హత సాధించాయి, ఇక్కడ నేపాల్ స్వల్పంగా మాత్రమే ఈ అవకాశాన్ని కోల్పోయింది. ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు సూపర్ 4 దశకు చేరుకుంటాయి.
Also Read : CM MK Stalin Huge Investments : యూరప్ టూర్ లో రూ. 15,516 కోట్ల ఒప్పందం



















