హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడు సుకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో చర్చకు దారి తీశాయి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చూసిన వారు ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకోక తప్పదన్నారు అల్లు అరవింద్. ఇదే సమయంలో తాను నిర్మాత చేసిన సవాల్ ను ఓడి పోయానని సుకుమార్ ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌కు చెల్లించాల్సిన రూ. 1 లక్ష చెక్కుకు సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘పుష్ప’ చిత్ర దర్శకుడు సుకుమార్, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడంతో నిర్మాత అల్లు అరవింద్‌తో తాను పెట్టుకున్న సవాలులో ఓడిపోయానని వెల్లడించారు. ఈ సవాలు ప్రకారం సుకుమార్ సినిమాను ఏమాత్రం కన్నీళ్లు పెట్టుకోకుండా పూర్తిగా చూస్తే అల్లు అరవింద్ ఆయనకు రూ. 1 కోటి ఇస్తానని చెప్పారు. ఒకవేళ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన అల్లు అరవింద్‌కు రూ. 1 లక్ష చెల్లించాలి.
సుకుమార్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అల్లు అరవింద్ ఫోటోను, ఆయన పేరు మీద రాసిన రూ. 1 లక్ష చెక్కును పోస్ట్ చేయడం వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. సినిమా చూస్తున్నప్పుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, తద్వారా సవాలులో ఓడిపోయానని పేర్కొన్నారు. నిన్న అరవింద్ నాకు ఫోన్ చేసి ఒక ఆసక్తికరమైన సవాలు విసిరారు.. ‘ఏయ్ సుకుమార్, వెళ్లి ‘ఆకాశంలో ఒక తారస సినిమా చూడు. ఒకవేళ కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే నీకు రూ. 1 కోటి ఇస్తాను. ఒకవేళ కన్నీళ్లు వస్తే, నువ్వు నాకు రూ. 1 లక్ష ఇవ్వాలి అని చెప్పారు. ఎంత ఖరీదైన సిఫార్సు సార్ ఇది అని పేర్కొన్నారు సుకుమార్. ‘ఆకాశంలో ఒక తార’ అనేది ఒక సైన్స్-ఫిక్షన్ డ్రామా. ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహించగా ఆయనతో పాటు గున్నం గంగరాజు , వసంత్ జుర్రు కలిసి కథను అందించారు.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతి హాసన్, రుహాని శర్మ, స్వసిక, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్, ప్రవీణ్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, కోట జయరామ్ , చైతన్య జొన్నలగడ్డ తదితరులు నటించారు. సుజిత్ సారంగ్ ఛాయాగ్రాహకుడిగా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటర్‌గా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా పనిచేశారు.


















