Goa Governor – Ashok Gajapathi Raju Proven : గోవా గ‌వ‌ర్న‌ర్ గా కొలువు తీరిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు

హాజ‌రైన మంత్రులు నారా లోకేష్‌, సంధ్యా రాణి, శ్రీ‌నివాస్

Hello Telugu - Goa Governor - Ashok Gajapathi Raju Proven

Hello Telugu - Goa Governor - Ashok Gajapathi Raju Proven

Ashok Gajapathi Raju : గోవా – ఏపీకి చెందిన పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు (Ashok Gajapathi Raju) శ‌నివారం గోవా రాష్ట్ర నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండ‌టం అల‌వాటు. త‌ను తెలుగుదేశం పార్టీలో కీల‌క‌మైన పాత్ర పోషించారు. ప్ర‌స్తుతం ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరింది. ఆయ‌న‌కు కేబినెట్ లో చోటు ద‌క్కుతుంద‌ని అంతా భావించారు. కానీ ఊహించ‌ని రీతిలో ఉన్న‌ట్టుండి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ల‌భించింది. ఇక గోవా రాష్ట్రానికి 20వ గ‌వ‌ర్న‌ర్ గా కొలువు తీరారు.

Ashok Gajapathi Raju Sworn as a Goa Governor

జూన్ 26 , 1951లో పుట్టారు అశోక్ గ‌జ‌ప‌తి రాజు. త‌న వ‌య‌సు 74 ఏళ్లు. జీవిత భాగ‌స్వామి సునీలా గ‌జ‌ప‌తి రాజు. ఇద్ద‌రు కూతుళ్లు. ఒక‌రు అదితి గ‌జ‌ప‌తి రాజు, మ‌రొక‌రు విద్యా గ‌జ‌ప‌తిరాజు. హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ లో చ‌దివారు. విజయనగరం ఎస్టేట్ కు ఓన‌ర్ గా ఉన్నారు. పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వాడే. వీరి తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు పార్ల‌మెంట్ స‌భ్యులుగా ప‌ని చేశారు.

అశోక్​ గజపతిరాజు సతీమణి సునీలా గజపతిరాజు విజయనగరం మున్సిపల్‌ ఛైర్మన్‌గా పని చేశారు. కూతురు అదితి గజపతిరాజు 2024 శాసనసభ ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అశోక్ గజపతిరాజు జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు.

అశోక్ గజపతిరాజు 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో విమాన‌యాన శాఖ మంత్రిగా ప‌ని చేశారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించారు.

Also Read : TTD Amazing Celebrations : ఆగ‌స్టు నెల‌లో విశేష ఉత్స‌వాలు – టీటీడీ

Exit mobile version