TTD : తిరుపతి – టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మ వారి గ్రూప్ ఆలయాలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది . శ్రీ పద్మావతీ అమ్మ వారి ఆలయంలో ఆగస్టు 01, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ వారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారని స్పష్టం చేసింది. ఆగస్టు 8న ఉదయం 10 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మ వారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుందని పేర్కొంది టీటీడీ.
TTD Amazing Celebrations
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో ఆగస్టు 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు స్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహించనున్నారు . శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో ఆగస్టు 16న గోకులాష్ఠమి సందర్భంగా పెద్ద శేష వాహనంపై స్వామి వారు కటాక్షించనున్నారు. ఆగస్టు 17న ఉట్లోత్సవం, ఆస్థానం ఉంటుందని తెలిపింది టీటీడీ (TTD). శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆగస్టు 26న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామి వారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇస్తారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీలలో వేంకటేశ్వర స్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 1, 8, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం జరుగుతుందని తెలిపింది టీటీడీ. ఆగస్టు 3, 10, 17, 24, 31వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం జరుగుతుందని పేర్కొంది టీటీడీ.
5న మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాద పద్మారాధన సేవ. 9న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం, 13న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
Also Read : TTD Interesting Comments : శ్రీవారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ
