హైదరాబాద్ : ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. సినీ అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ది ఎపిక్ మూవీ. కోట్లాది రూపాయలు వసూలు చేసింది. సీక్వెల్ కూడా వచ్చింది. ఇది కూడా రికార్డ్ బ్రేక్ చేసింది. తాజాగా జక్కన్న మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇందులో కీ రోల్స్ పోషిస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా. మరో కీలక పాత్రను పోషిస్తున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్. ఇదిలా ఉండగా తెలుగు చలన చిత్ర రంగంలో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో విడుదలై బిగ్ సక్సెస్ అయిన సినిమాలను తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలక అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి.
ఇందుకు సంబంధించి ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సినీ ప్రేక్షకులకు తీపి కబురు చెప్పింది. క్రిస్మస్ పండుగ సందర్బంగా ఓటీటీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు దర్శకుడు జక్కన్న. ఈ మేరకు కొన్ని సీన్స్ ను కూడా జోడించినట్లు తెలిపాడు. మరింత వినోదాన్ని పంచేందుకు తీసుకు వచ్చామన్నాడు. ఇందుకు సంబంధించి తమ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ తెలిపాడు ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంస్థకు. ది ఎపిక్ మూవీ ఈ సంవత్సరం నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. అప్పటి నుండి అభిమానులు దాని డిజిటల్ ప్రవేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
