PVN Madhav : విశాఖపట్నం : ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు జోనల్ ఇంఛార్జిలను నియమించారు. విశాఖ పట్టణంలో జరిగిన కీలక సమావేశానికి ఆర్గనైజేషనల్ సెక్రటరీ మదుకర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అంశాలపై చర్చించారు. ప్రధానంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల తో ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ (PVN Madhav) ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం విశేషం. సారథ్యం యాత్ర పై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఆయా ప్రాంతాల వారీగా జోనల్ ఇంచార్జీలను నియమించారు.
PVN Madhav Key Decision
ఉత్తరాంధ్ర జోన్ లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం ,విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఇంఛార్జిగా మట్టా ప్రసాద్ ను నియమించారు. గోదావరి జోన్ లోని కాకినాడ, డా. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఇంఛార్జిగా లక్ష్మీ ప్రసన్న, కోస్తాంధ్ర జోన్ లోని గుంటూరు , పల్నాడు , బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు నాగోతు రమేష్ నాయుడుకు బాధ్యతలు అప్పగించారు బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. ఇక రాయలసీమ జోన్ లోని అన్నమయ్య, చిత్తూరు , కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఇంఛార్జిగగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని నియమించినట్లు తెలిపారు.
Also Read : Telangana Huge Rains : తెలంగాణలో పలు చోట్ల వర్షాలు

















