Harish Rao Fired on Telangana Govt : హామీల అమ‌లులో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్

కాంగ్రెస్ స‌ర్కార్ పై హ‌రీశ్ సీరియ‌స్

Hello Telugu - Harish Rao Fired on Telangana Govt

Hello Telugu - Harish Rao Fired on Telangana Govt

Harish Rao : హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం చేసింద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటిని అమ‌లు చేయ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌లే కేటీఆర్ తో క‌లిసి బాకీ కార్డుల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా ఇంటింటికీ తిరుగుతూ హ‌రీష్ రావు (Harish Rao) వీటిని పంపిణీ చేశారు. మోసం కాంగ్రెస్ నైజం అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో ఇంటింటికి బాకీ కార్డు అందించడం ద్వారా తెలియ చేస్తున్నామ‌ని చెప్పారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంచి 22 నెలలైనా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఏ ఒక్క హామీ నెరవేర్చక పోయినా ప్రజలు అడగడం లేదని అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

MLA Harish Rao Slams Telangana Govt

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం పడిపోదన్నారు హ‌రీశ్ రావు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నా, ప్రతి మహిళకు రూ. 2500 రావాలన్నా, ప్రతి వృద్ధులకు రూ. 4000 రావాలన్నా, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా, కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ మెంట్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓట్ల‌తో బుద్ది వ‌చ్చేలా చేయాల‌న్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే ఇచ్చిన హామీలు అమలు అవుతాయ‌ని జోష్యం చెప‌ప్పారు. ఒకవేళ గెలిపిస్తే మేము హామీలు అమలు చేయక పోయినా ప్రజలు ఏమనడం లేదని అనుకునే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు.

Also Read : KTR Fired on Telangana Govt : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కేటీఆర్ ఫైర్

Exit mobile version