YS Sharmila : అమరావతి – ఏపీపీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) ఏపీ కూటమి సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి YCPపై కోపాన్ని దివంగత మాజీ సీఎం YSR విగ్రహాల మీద చూపిస్తారా అని నిలదీశారు. అసలు YCPకి YSRకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. మహానేత పేరు పెట్టినంత మాత్రాన YSR ఏమైనా వారి సత్తా అని పేర్కొన్నారు. లేక పేటెంట్ రైటా ? YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. ఏ సీఎం చేయనంత సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తనదేనని అన్నారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర అన్నారు షర్మిల.
YS Sharmila Slams NDA Govt
సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన జన నాయకుడు తన తండ్రి అని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా ? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా ? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య అని మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. నందిగామ గాంధీ సెంటర్ లో మహానేత YSR విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం అన్నారు. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మహానేత మరణం తర్వాత గాంధీ సెంటర్ వద్ద నాటి ప్రభుత్వం అక్కడ YSR విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు . YSR విగ్రహం చుట్టూ YCP అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగించు కోవాలన్నారు. మాకేం అభ్యంతరం లేదన్నారు. కానీ ఇదే సాకుగా చూపి YSR విగ్రహాల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : KTR Interesting : రామన్నకు రాఖీ కట్టిన లగచర్ల బిడ్డలు
