AP : అమరావతి – అమరావతి అభివృద్ధికి ఆంధ్రా సీఆర్‌డీఏ 20,494 ఎకరాల అదనపు భూ సమీకరణకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అమరావతికి భారీ ప్రోత్సాహం లభించింది. గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరం కోసం ఇప్పటికే 54,000 ఎకరాల భూమిని సేకరించింది ప్రభుత్వం. మంగళగిరి, విజయవాడ, గుంటూరు, తాడేపల్లిలను అమరావతితో కలిపి మెగా పోలిస్ నిర్మించే ప్రయత్నంలో భాగంగా మరో 40,000 ఎకరాలను సమీకరించే ప్రక్రియపై ఫోకస్ పెట్టింది.
AP RDA Approved for Amarvathi Land Acquisition
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేతృత్వంలో 50వ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) సమావేశం జరిగింది. అమరావతిలోని గ్రీన్‌ఫీల్డ్ రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల నుండి అదనంగా 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ. ఈ 20,494 ఎకరాలు అమరావతి మండలంలోని నాలుగు గ్రామాలు, తుళ్లూరు మండలంలో మూడు గ్రామాల నుండి సమీకరించనున్నట్లు స్పష్టం చేశారు.
రాజధాని ప్రాంతంలో అధిక సాంద్రత కలిగిన నివాస మండలాలు, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదన కోసం అభ్యర్థన జారీ చేయడానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. మందడం, తుళ్లూరు, లింగాయపాలెం గ్రామాలలో 58 ఎకరాల భూమిలో హై-డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ ,మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు మంత్రి నారాయణ.
అంతే కాకుండా మందడం, తుళ్లూరు, లింగాయపాలెం గ్రామాలలో నాలుగు కన్వెన్షన్ సెంటర్లను నిర్మించే ప్రతిపాదనకు కూడా పర్మిషన్ లభించిందన్నారు. అమరావతిలో నిర్మాణ ప్రాజెక్టులకు మద్దతుగా ఇసుక తవ్వకాల పనులకు కూడా అనుమతి ఇచ్చిందన్నారు.
Also Read : Minister Vakiti Interesting Comment : హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించాలి – వాకిటి
