Minister Vakiti Interesting Comment : హైద‌రాబాద్ లో ఒలింపిక్స్ నిర్వ‌హించాలి – వాకిటి

అధికారులు క్రీడా రంగాలను సందర్శించాలి

Hello Telugu - Minister Vakiti

Hello Telugu - Minister Vakiti

Minister Vakiti : హైద‌రాబాద్ – రాబోయే రోజుల్లో హైద‌రాబాద్ లో ఒలింపిక్స్ నిర్వ‌హించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని చెప్పారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి (Minister Vakiti). 2036లో ఈ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. వీటిని ఇక్క‌డికి తీసుకు వ‌చ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని చెప్పారు. క్రీడా శాఖ‌లో ప‌ని చేస్తున్న అధికారులు దృష్టి సారించాల‌న్నారు. క్రీడా రంగంలోకి అడుగు పెట్టాలని, క్రీడా అకాడమీలను సందర్శించాలని, ఆవిష్కరణలకు ఊపిరి పోయాల‌ని స్ప‌ష్టం చేశారు. గత వైఫల్యాలు, బద్ధకాన్ని పక్కనపెట్టి, నూతన ఉత్సాహంతో, క్రీడా శాఖ తన కార్యకలాపాలలో ఆవిష్కరణలను ప్రదర్శించాలని ఉద్ఘాటించారు.

Minister Vakiti Interesting Comments

సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎనుముల‌ రేవంత్ రెడ్డి ఆలోచనల ప్రకారం, క్రీడా శాఖ పనితీరు అత్యున్నత స్థాయికి చేరుకోవాలని నొక్కి చెప్పారు.2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ఈ విభాగం పని చేయాలని, నిజాయితీగా కృషి చేస్తే ఈ లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుందని స్ప‌ష్టం చేశారు.

క్రీడలలో సమూల మార్పు తీసుకు రావడానికి, కేవలం కార్యాలయాల్లో కూర్చోవడం పనికి రాదన్నారు. అధికారులు రంగంలోకి దిగాలన్నారు. విజయవంతమైన క్రీడా కార్యక్రమాలను నిర్ధారించడానికి, శాఖ పని శైలిని మెరుగు పరచడానికి తాను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తాన‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిశీలిస్తాన‌ని పేర్కొన్నారు మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి. ఆదిలాబాద్, కరీంనగర్ సహా అకాడమీలను సందర్శించడం, విద్యార్థులు, కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు.

క్రీడా అభివృద్ధి కోసం రాష్ట్రంలోని క్రీడా నిపుణులను సంప్రదించి, వారి సలహాలు తీసుకొని తదనుగుణంగా ముందుకు సాగుతామని శ శ్రీహరి చెప్పారు. త్వరలో, అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి ఆలోచనలను సేకరించి క్రీడా అభివృద్దిపై ఫోక‌స్ పెడతామ‌న్నారు.

Also Read : MLC Kavitha Sensational Comments : ఏక‌ల‌వ్య భ‌వ‌నాన్ని పూర్తి చేయాలి – క‌విత

Exit mobile version