AP Huge Investments : ఏపీకి రూ. 468 కోట్ల‌తో సెమీ కండ‌క్ట‌ర్

పార్ల‌మెంట్ లో ప్ర‌క‌టించిన అశ్విని వైష్ణ‌వ్

Hello Telugu - AP Huge Investments

Hello Telugu - AP Huge Investments

AP : న్యూఢిల్లీ – ఏపీకి తీపి క‌బురు చెప్పారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ (Ashwini Vaishnaw). పార్ల‌మెంట్ లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒడిశా, పంజాబ్, ఏపీలో రూ.4,594 కోట్ల పెట్టుబడితో 4 సెమీకండక్టర్ ప్లాంట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింద‌ని ప్ర‌క‌టించారు. దేశంలో చిప్ సౌకర్యాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడానికి రూ.76,000 కోట్ల వ్యయంతో కూడిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఈ ప్రతిపాదనలు ఆమోదించిన‌ట్లు వెల్ల‌డించారు. వచ్చే నెలలో జరిగే యుఎన్జీఏ సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి అమెరికాను సందర్శించే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్‌లో రూ. 2,066 కోట్ల పెట్టుబడితో సిసెమ్ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అశ్విని వైష్ణ‌వ్ ప్ర‌క‌టించారు.

Union Govt Approved to Build Semi Conductor Industry in AP

రాష్ట్రంలో రూ. 1,943 కోట్ల పెట్టుబడితో 3డీ గ్లాస్ తయారీ కోసం మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 3D గ్లాస్ సెమీకండక్టర్ ప్లాంట్‌కు ప్రముఖ అమెరికా టెక్నాలజీ సంస్థ ఇంటెల్, లాక్‌హీడ్ మార్టిన్ మొదలైన వాటి పెట్టుబడి మద్దతు ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్‌ను క్యాబినెట్ ఆమోదించినట్లు పేర్కొన్నారు అశ్విని వైష్ణ‌వ్. దీనిని అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 468 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుందన్నారు. పంజాబ్‌లో రూ. 117 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీ సంస్థ సీడీఐఎల్ సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలియ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : Telangana High Alert Warning : ఎడ తెగ‌ని వాన త‌ల్లడిల్లిన తెలంగాణ

Exit mobile version