Minister Kollu Ravindra Fired on Perni : పేర్ని నానిపై భ‌గ్గుమ‌న్న కొల్లు ర‌వీంద్ర‌

క‌ల్తీ మ‌ద్యం సూత్ర‌ధారుల‌ను వెల్ల‌డిస్తాం

Hello Telugu - Minister Kollu Ravindra Fired on Perni

Hello Telugu - Minister Kollu Ravindra Fired on Perni

Kollu Ravindra : మ‌చిలీప‌ట్నం : మాజీ మంత్రి పేర్ని నానిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. త‌ను మ‌తి చెడి మాట్లాడుతున్నాడంటూ ఆరోపించారు. కల్తీ మద్యంలో సూత్రధారులు, పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తాం అన్నారు. మ‌చిలీప‌ట్నంలో కొల్లు ర‌వీంద్ర (Kollu Ravindra) మీడియాతో మాట్లాడారు. ఇండెంట్ ప్రకారమే మద్యం కేటాయిస్తారని పేర్ని నాని తెలుసుకుంటే మంచిద‌న్నారు. డిజిటల్ పేమెంట్లు పూర్తిగా నిలిపేసిందెవరో ప్రజల్ని కనుక్కుందాం రా అని స‌వాల్ విసిరారు. మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం కేసును పారదర్శకంగా విచారిస్తున్నామ‌ని చెప్పారు. తప్పు చేసినోళ్లు, తప్పుడు ప్రచారం చేసినోళ్లకూ బుద్ధి చెప్పి తీరుతామని అన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి పారదర్శకంగా విచారణ జరిపిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి చెప్పారు.

MInister Kollu Ravindra Slams Perni Nani

ఇబ్రహీంపట్నంలో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను గుంటూరులోని ల్యాబ్‌కు పంపించా మన్నారు. ల్యాబ్ రిపోర్టుల ప్రకారం మద్యం కల్తీ నిజమేనని, అయితే గతంలో ఉన్నట్లుగా ప్రమాదకరమైన రసాయనాలు ఏవీ నిర్ధారణ కాలేదన్నారు. నివేదికలు బయటకు రాకముందే వైసీపీ నేతలు, బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతల ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన రావు స్పష్టం చేశాడని అన్నారు. జోగి రమేష్ అండతోనే ఇబ్రహీంపట్నం, మొలకల చెరువులో మద్యం కల్తీ చేసినట్లు తెలిపాడన్నారు. అదే సమయంలో జనార్ధన్ రావు తన ఇంటికొచ్చినట్లు జోగి రమేష్ కుూడా అంగీకరించాడని పేర్కొన్నారు మంత్రి. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతల పాత్ర, ప్రభుత్వంపై చేసిన కుట్ర బయట పడుతుండడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Harish Rao Fired on Congress : రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వ వైఖ‌రి

Exit mobile version