Harish Rao Fired on Congress : రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వ వైఖ‌రి

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆగ్ర‌హం

Hello Telugu - Harish Rao Fired on Congress

Hello Telugu - Harish Rao Fired on Congress

Harish Rao : హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్, కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడుతున్నాయ‌ని ఆరోపించారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao). ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయ‌ని, ఇక రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాల్సింది వారేన‌ని పేర్కొన్నారు. ఆదివారం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరని ప్ర‌శ్నించారు. పార్లమెంట్‌లో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్ కు 99 ఎంపీల బలం ఉంద‌న్నారు. ఆ విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ని అనుకోవ‌డం భ్ర‌మ అన్నారు. రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్య పెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కావాల‌ని బీసీల‌ను నిట్ట నిలువునా మోసం చేస్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Harish Rao Slams Congress Govt

ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదని ఆవేద‌న చెందారు. బీజేపీ అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్న‌ద‌ని దీని వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటో చెప్పాల‌న్నారు. గడిచిన 35 ఏళ్ళల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేద‌న్నారు. కేవ‌లం రాజ‌కీయంగా ల‌బ్ది పొందేందుకే బీసీ నినాదం ఎత్తుకున్నార‌ని ఆరోపించారు హ‌రీశ్ రావు. కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయని మండిప‌డ్డారు.

Also Read : Gowda Community Fired on MLA Vasantha Krishna : ఖబడ్దార్ కృష్ణ వ‌సంత ప్రసాద్

Exit mobile version