Home Minister Anitha Fired on YS Jagan : జ‌గ‌న్ నిర్వాకం వైసీపీ ఎమ్మెల్యేల‌కు శాపం

హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత

Hello Telugu - Home Minister Anitha Fired on YS Jagan

Hello Telugu - Home Minister Anitha Fired on YS Jagan

Home Minister Anitha : ప్ర‌కాశం జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Home Minister Anitha) షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి నిప్పులు చెరిగారు. ఎవ‌రైనా ఎమ్మెల్యే కావాల‌ని అనుకుంటారు రాజ‌కీయాల‌లో ఉన్న వారు. కానీ విచిత్రం ఏమిటంటే ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేల‌కు తాము ఎందుకు ఎమ్మెల్యేలం అయ్యామోన‌ని ఆందోళన చెందుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డినేనంటూ ఫైర్ అయ్యారు. ఆయ‌న నిర్వాకం కార‌ణంగా వాళ్లు అసెంబ్లీకి రాలేక పోతున్నార‌ని చెప్పారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ప‌ర్య‌టించారు వంగ‌ల‌పూడి అనిత‌. ఈ సంద‌ర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

Home Minister Anitha Slams YS Jagan

అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంద‌ని చెప్పారు. కానీ జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతోంద‌న్నారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వక పోవడం దురదృష్టక‌ర‌మ‌ని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని స్ప‌ష్టం చేశారు. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చే ది కాదని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ప‌దే ప‌దే దీనిని రాజ‌కీయం చేయాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆయ‌న సీఎంగా గ‌తంలో ప‌ని చేశారు. ఆ మాత్రం తెలుసుకోకుండా చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష ప్ర‌భుత్వం ఇవ్వ‌ద‌ని, అది కేవ‌లం ప్ర‌జ‌లు మాత్ర‌మే ఇస్తార‌ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

Also Read : CM Chandrababu-AP Growth : కాలుష్య ర‌హితంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : చంద్ర‌బాబు

Exit mobile version