Elon Musk Shocking Trump : ది అమెరికా పార్టీ పేరుతో ఎలాన్ మ‌స్క్ కొత్త పార్టీ

డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చిన టెస్లా చైర్మ‌న్

Hello Telugu - Elon Musk Shocking Trump

Hello Telugu - Elon Musk Shocking Trump

Elon Musk : అమెరికా – టెస్లా చైర్మ‌న్, ఎక్స్ సీఈవో ఎలాన్ మ‌స్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఆమోదం పొందితే త‌ప్ప‌కుండా పార్టీ పెడ‌తానంటూ గ‌తంలో తెలిపారు. సోషల్ మీడియాలో సలహాలకు, సూచనలకు అనుగుణంగా ఎక్స్ ఖాతాదారుల‌ నుంచి భారీ మద్దతు లభించడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప‌లికారు ఎలాన్ మ‌స్క్ (Elon Musk) అధ్య‌క్షుడు ట్రంప్ కు. త‌ను ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అత్య‌ధిక ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చారు ప్రెసిడెంట్. కానీ ఎందుక‌నో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి.

Elon Musk Shocking Donald Trump

చివ‌ర‌కు ఒక‌రిపై మ‌రొక‌రు కామెంట్స్ చేసుకునే స్థాయికి వెళ్లారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి త‌ను కూడా పాలిటిక్స్ కు రావాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఆ కార‌ణం త‌ను ఇబ్బంది ప‌డ‌డ‌మే. మొత్తంగా ట్రంప్ తో జ‌రిగిన నాట‌కీయ విభేదాల త‌ర్వాత తాను కొత్త రాజ‌కీయ పార్టీని ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ బిలియ‌నీర్ల‌లో టాప్ లో కొన‌సాగుతున్నాడు ఎలాన్ మ‌స్క్. తాజాగా త‌న సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో తాను అమెరికా పార్టీని స్థాపించాన‌ని, దానిని రిపబ్లికన్ , డెమోక్రటిక్ ద్విపార్టీ వ్యవస్థకు సవాలుగా అభివర్ణించానని ప్రకటించారు.

అయితే, పార్టీ అధికారికంగా US ఎన్నికల అధికారులతో నమోదు చేయబడిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. కాగా ఈ పార్టీని ఎవరు నడిపిస్తారో లేదా అది ఏ రూపంలో ఉంటుందో మస్క్ వివరాలను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. అమెరికా పార్టీ స్వేచ్ఛ‌ను కోల్పోయిన వారికి తిరిగి స్వాతంత్రం ఇవ్వ‌బ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఎలాన్ మ‌స్క్.

Also Read : Uddhav and Raj Thackeray Sensational : 20 ఏళ్ల త‌ర్వాత ఒక్క‌టైన మ‌రాఠా యోధులు

Exit mobile version