AP Govt : అమరావతి : సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం (AP Govt) కీలక ప్రకటన చేసింది. ఉల్లి రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున స్పష్టమైన హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో భాగంగా ప్రతి హెక్టారుకు రూ. 50 వేల చొప్పున అన్నదాతలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెంద వద్దని కోరారు. ఆరు నూరైనా సరే సాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
AP Govt Focus
ఈ నిర్ణయంతో కారణంగా తమ సర్కార్ పై సుమారు రూ.100 కోట్లు అదనపు భారం పడనుందని చెప్పారు. కర్నూలు ఖరీఫ్ సీజన్ లో 45,278 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసారని, 24, 218 మంది రైతులు లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చర్యకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. పంటకు ధర పలికినప్పుడే ఉల్లిని విక్రయించాలని రైతులకు మంత్రి సూచించారు. మార్కెట్లో సమయానుసారం ధరలు లభించే వరకు రైతులు సహనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆర్థిక సాయం రైతులకి తక్షణ ఉపశమనం లభిస్తుందన్నారు.
Also Read : YS Jagan Fired on CM Chandrababu : ప్రజారోగ్యానికి చంద్రబాబు పాతర : జగన్
