Nara Lokesh : సింగపూర్ – ఆంధ్రప్రదేశ్ లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో టెజారాక్ట్, US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయుపై సంతకాలు చేశారు.
Minister Nara Lokesh Key Updates on Google Startups
అంతకు ముందు గూగుల్ క్లౌడ్ డైరక్టర్ డ్రూ బ్రైన్స్‌తో భేటీ అయ్యారు. విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్ లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కోరారు. ఇదే సమయంలో ఎస్ టి టెలీమీడియా ఇన్వెస్టిమెంట్స్ (ఇండియా) హెడ్ రీతూ మెహ్లావత్ తో నారా లోకేష్ సమావేశం అయ్యారు. డేటా సిటీగా ఆవిష్కృతమవుతున్న విశాఖపట్నంలో ఎస్ టి టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.
మురాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి హిరోయికి నివాతో చర్చించారు. ఏపీలో మురాటా ఎలక్ట్రానిక్స్ అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరగా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు మురాటా ఎండీ. ఇదేక్రమంలో సింగపూర్ లో క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అరుణ్ భాటియాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు . ఏపీలోని అమరావతి, విశాఖపట్నం వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో క్యారియర్ HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్) వ్యవస్థలను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. ఈ సందర్బంగా మంత్రి చేసిన ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు ఏడీ.
Also Read : CM Chandrababu New Innovation : ఇన్నోవేషన్ సెంటర్లకు సహకరించండి – సీఎం
