CM Chandrababu New Innovation : ఇన్నోవేష‌న్ సెంట‌ర్ల‌కు స‌హ‌క‌రించండి – సీఎం

ఏపీని ఏఐ ప‌రిశోధ‌న‌లకు కేరాఫ్ గా మారుస్తాం

Hello Telugu - CM Chandrababu New Innovation

Hello Telugu - CM Chandrababu New Innovation

CM Chandrababu : సింగ‌పూర్ – రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో స‌ర్కార్ పూర్తిగా స‌హ‌కారం అందించేందుకు సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. మెరుగైన పారిశ్రామిక పాల‌సీని రూపొందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

CM Chandrababu Key Comments

ఏపీలో పెట్టుబడి అవకాశాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, సింగపూర్ కు చెందిన పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. ఏపిలో పెట్టుబడులకు గల అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను వివరించారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎపి అనుకూలమని వివరించారు. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేశామన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని అన్నారు. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

2026 జనవరి నాటికల్లా ప్రారంభం అయ్యే క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టమ్ లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలు పొందటంతో పాటు పరిశోధనలు చేయొచ్చని వెల్లడించారు. ఇప్పటికే గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ దిగ్గజ కంపెనీలు విశాఖకు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్‌.

Also Read : Seediri Appalaraju Fired on NDA Govt : లులూకు చౌక‌గా భూముల అప్ప‌గింత దారుణం

Exit mobile version