AP Govt : అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న కార్మికులు, పారిశుధ్య కార్మికులకు , సిబ్బందికి తీపి కబురు చెప్పింది. రేయింబవళ్లు వారంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారని ఇందుకు సంబంధించి వారు పలు సందర్భాలలో అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఏపీ సర్కార్ కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
AP Govt – Municipal Workers
ఈ మేరకు పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం తమ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఇందు కోసం వేలాది పని చేస్తున్నారని వారి భద్రతకు సంబంధించి ప్రమాద బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలలో 55,686 మంది కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రమాద కవరేజికి గాను రూ. 1 కోటి ఉండగా జీవిత కవరేజి రూ. 10 లక్షల బీమా కల్పిస్తామన్నారు.
ఇక అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగితే రూ. 20 లక్షలు , జీవిత కవర్ కు రూ. 2 లక్షలు , పిల్లలకు రూ. 8 లక్షల వరకు విద్యా సహాయం కూడా అందజేస్తామన్నారు. తక్కువ ప్రీమియంతో కుటుంబాలకు రూ. 33 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీరో-బ్యాలెన్స్ కుటుంబ ఖాతాలతో అదనంగా రూ. 15 లక్షల ప్రమాద కవర్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి శాఖ , యాక్సిస్ బ్యాంక్ తో టై అప్ చేసుకున్నామన్నారు.
Also Read : Minister Ram Prasad Interesting Update : ఆంధ్రా యువ సంకల్ప్ – 2025 ప్రతిభకు వేదిక
